బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర ఖరారు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో దఫా పాదయాత్ర ఖరారైంది. ఏప్రిల్ 14 నుంచి ఆయన నడవనున్నారు. మొదటి విడతలో 36 రోజుల పాటు పాదయాత్ర సాగగా.. ఈ సారి 200 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. మొత్తం ఐదు విడతలుగా ఆయన పాదయాత్ర చేయనున్నారు. రెండో విడత యాత్రను జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలో బీజేపీ బలపడింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారింది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు, హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయంతో కమలనాథుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఇదే ఊపులో దూసుకెళ్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గద్దె దింపాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నారు.