‘తేజ్ ఐ లవ్ యూ’ సెన్సార్ టాక్

కరుణాకరణ్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్-రాశీఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యూ’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. సింగిల్ కట్ కూడా లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ని పొందింది. ఇదో అందమైన ప్రేమకవితలా ఉంటుందని చిత్రబృందం చెప్పిన సంగతి తెలిసిందే. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అది నిజమేనని చెప్పినట్టు తెలిసింది.

ప్రేమకథలు తెరకెక్కించడంలో దర్శకుడు కరుణాకరణ్ స్పెషలిస్టు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథలు ‘తొలిప్రేమ’, ‘డార్లింగ్’… బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఓ మంచి లవ్ స్టోరీ చేయాలనుకొంటే స్టార్ హీరోలు సైతం కరుణాకరణ్ వైపు చూస్తుంటారు. అలాంటి దర్శకుడు నుంచి వస్తున్న ‘తేజ్ ఐ లవ్ యూ’ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

ఇక, ఈ మధ్య తేజు కు విజయాల్లేవ్. ఆయన నటించిన విన్నర్, జవాన్, ఇంటిలిజెంట్ సినిమాలు ప్లాపులుగా మిగిలియా. ఇదీగాక, తేజ్ రొటీన్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేస్తున్నాడనే విమర్శలొచ్చాయి. ‘తేజ్ ఐ లవ్ యూ’తో ఆ ముద్రని చెరిపోసుకోవడానికి తేజు ఇదో మంచి అవకాశంగా చెబుతున్నారు. మరీ.. తేజ్ లవ్ స్టోరీని చేసేందుకు ఈ శుక్రవారం వరకు ఆగాల్సిందే.