అఖిల్ అదృష్టం

అఖిల్ అక్కినేనికి గుడ్ టైమ్ స్టార్ అయినట్టుంది. బిగ్ ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైయింది. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్, అఖిల్ తో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు.. ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా జాన్వీ కపూర్ నటించే అవకాశం వుంది.

జాన్వీ కోసం టాలీవుడ్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తోంది. స్టార్ హీరోలు ఆమెతో రొమాన్స్ చేయాలని ఆశపడుతున్నారు. ఈ లిస్టులో మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ .. ఇలా చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ ఆ అదృష్టం అఖిల్ కి దక్కేలా ఉంది. అఖిల్ బాలీవుడ్ సినిమా కోసం హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్సయినట్టు తెలుస్తోంది. 
ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే.. పాన్ ఇండియా సినిమా మొదలు కానుంది.

వాస్తవానికి జాన్వీ రౌడీ హీరో విజయ్ దేవరకొండపై మనసుపడింది. అర్జున్ రెడ్డి సినిమా చూసిన తర్వాత రౌడీకి ఫిదా అయింది. అవకాశం వస్తే విజయ్ లా మారాలని ఉంది. అతడితో డేటింగ్ చేయాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టింది. అయితే విజయ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా లైగర్ కోసం అనన్య పాండేను తీసుకున్నారు. విజయ్ నెక్ట్స్ సినిమా కోసం జాన్వీని తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోగా జాన్వీతో అఖిల్ రొమాన్స్ మొదలు పెట్టే ఛాన్స్ ఉందని టాక్.