రష్యాపై 5,500 ఆంక్షలు
ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు దిగడంతో ప్రపంచంలోనే అత్యధికంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా నిలచింది. ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి 24న సైనిక చర్యలకు దిగింది. ఆ తర్వాత రష్యాపై అమెరికా, బ్రిటిన్‌తో పాటు పాశ్చాత్య దేశాలు 2700కు పైగా ఆంక్షలు విధించాయి. ప్రస్తుతం రష్యాపై మొత్తం 5,500కు పైగా ఆంక్షలు అమలులో ఉన్నాయి.
ఈనేపథ్యంలో రష్యా పాశ్చాత్య దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. తమపై ఆంక్షలు విధిస్తే నష్టపోయేది మీరే అని హెచ్చరించారు. జర్మనీని గ్యాస్‌ను తక్షణమే నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాము కూడా మీపై ఆంక్షలు పెట్టడం మొదలు పెట్టితే తట్టుకోలేరని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాలకు నొప్పి అంటే ఎంటో తెలిసే విధంగా తాము ఆంక్షలు విధాస్తామని అన్నారు.