ఏపీలోనూ కేసీఆర్ కు పాలాభిషేకాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగ సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. భారీ జాబ్స్ నోటిఫికేషన్స్ ఇస్తున్నట్లు బుధవారం శాసనసభ సాక్షిగా ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని, అలాగే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇస్తున్నామని ప్రకటించారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగాలలో 95 శాతం స్థానికులకు ఇస్తామని చెప్పారు. ఈ ప్రకటనతో తెలంగాణలోని నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీ నిరుద్యోగులు సీఎం జగన్ పై ఒత్తిడి తెస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏపీ నిరుద్యోగ ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి విశాఖలో పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 91 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సీఎం కేసీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీ నిరుద్యోగ ఐక్యకార్యాచరణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.