సన్నీ.. ఫ్రీ ఫ్రీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ నటించిన లెటెస్ట్ వెబ్ సిరీస్ ‘అనామిక’. విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సన్నీ గూఢచారిగా మారిన రోగ్‌గా నటించింది. సమీర్ సోని, సొన్నాల్లి సెగల్, రాహుల్ దేవ్, షెహజాద్ షేక్, అయాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ నెల 10నుంచి అనామిక అన్నీ ఏపీసోడ్స్ #MXPlayer స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం సన్నీ ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతోంది. #MXPlayer లో అనామికను ఫ్రీగా చూడొచ్చు అంటూ తనదైన శైలిలో ప్రచారం చేస్తుంది హాట్ బ్యూటీ. ఇక ఈ వెబ్ సిరీస్ లో రొమాంటిక్ సీన్స్ తో పాటు.. థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. థ్రిల్లర్ కథలను ఇష్టపడే వారికి అనామిక బెస్ట్ ఆప్షన్.