చైనాలో మళ్లీ కరోనా మరణాలు

చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని వారాలుగా రోజువారీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. శనివారం కరోనాతో రెండు మరణాలు నమోదైనట్లు చైనా జాతీయ ఆరోగ్య అధికారులు తెలిపారు. 2021 జనవరి తర్వాత ఈ దేశంలో వైరస్‌ మరణాలు చోటుచేసుకోవడం మళ్లీ ఇప్పుడే.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలను, బయటి ప్రపంచంతో సంబంధాలను తగ్గించడానికే కట్టుబడి ఉన్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్‌ ఉప మంత్రి వాంగ్‌ హెషెంగ్‌ స్పష్టం చేశారు.

చైనాలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైన నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రాలకు హెచ్చరిస్తూ.. కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. వాక్సినేషన్ లో మరింత వేగం పెంచాలని సూచించింది.