సామ్.. హాలీవుడ్ యాక్షన్

స్టార్ హీరోయిన్ సమంత యాక్షన్ మూడ్ లో కనిపిస్తున్నది. ఆమె నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా యశోద. సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు వున్నాయి. వీటి చిత్రీకరణకు హాలీవుడ్ యాక్షన్ స్పెషలిస్ట్ యానిక్ బెన్‌ ను పిలిపించారు. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో పది రోజుల పాటు ‘యశోద’ యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ కొడైకెనాల్‌లో జరిగే షెడ్యూల్‌లో తీయాలని ప్లాన్ చేశారు. మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన సెట్స్‌లో షూటింగ్ చేస్తున్నారు.

గతంలో సమంత నటించిన ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌ను ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో ‘యశోద’ ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్‌గా కూడా ఆయన వర్క్ చేశారు. మరోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సినిమా సినిమా కోసం యానిక్ బెన్ పని చేశారు. ఇక యశోదలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకులు.