తల్లి కాబోతున్న సోనమ్ కపూర్
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ తీపి కబురు చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్టు తెలిపింది. బేబీ బంప్ తో భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి దిగిన ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేసింది. ఇందులో ఇద్దరి మొహాలు వెలిగిపోతున్నాయి. తల్లిదండ్రులం కాబోతున్నామన్న ఆనందం కనిపిస్తున్నది. 2008 మే 8న ఆనంద్-సోనమ్ ల పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత కూడా సోనమ్ సినిమాలు చేసింది. ఏడాది ఒక సినిమా అన్నట్టుగా చేసింది.
2018లో ఆమె నటించిన సంజూ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఏడాది రెండు సినిమాలు చేసిన సోనమ్.. 2020లో ఒక సినిమా చేసింది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రస్తుతం బ్లైండ్ అనే సినిమాలో నటిస్తున్నది. ఇక సోనమ్ కెరీర్ లో ఢిల్లీ6, ఐ హేట్ లవ్ స్టోరీస్, రాంఝనా, భాగ్ మిల్కా భాగ్, నీర్జా లాంటి హిట్స్ ఉన్నాయి. ఫ్యాషన్ ఐకాన్ గా సోనమ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.