ప్రభాస్.. కల్కీ అవతార్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా ప్రోజెక్ట్ కె.  టైమ్ మెషీన్ కాన్సెప్ట్ ను మిక్స్ చేస్తూ చేస్తున్న మైథలాజికల్ ఫాంటసీ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూంది. విష్ణుమూర్తి కల్కి అవతారం కథ, అలాగే ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వద్ధామ పాత్రలను బేస్ చేసుకుని ఈ కథ సాగుతుందట.

ఆంజ‌నేయుడు, అశ్వ‌ద్ధామ లాంటి వాళ్ల‌కు చావు లేద‌ని పురాణాలు చెబుతున్నాయి. అశ్వద్దామ పాత్రలోనే అమితాబ్ కనిపిస్తారని సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతూంది. అంటే అశ్వద్దామ పాత్రలో అమితాబ్…కల్కి పాత్రలో ప్రభాస్ అన్నమాట. భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ కె తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్నారు.