పీకే డబ్బులు తీసుకొని పని చేయడు
ప్రముఖ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పీకే డబ్బులు తీసుకొని పని చేయరు. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి నిర్ణయం తీసుకున్నా. నా ఆహ్వానం మేరకు ప్రశాంత్ కిశోర్ వచ్చి పని చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ ఎనిమిదేళ్లుగా నాకు మంచి స్నేహితుడు. ఆయన ఎప్పుడూ డబ్బులు తీసుకొని పని చేయరు. దేశం పట్ల ఆయనకున్న నిబద్ధత ఏమిటో మీకు తెలియదు. ఆయన డబ్బులు తీసుకొని పనిచేస్తారని ఎవరైనా నిరూపిస్తారా?పార్టీల అవసరాల మేరకు 12 రాష్ట్రాల్లో పనిచేశారు. తమిళనాడు, ఏపీ, బంగాల్‌తో పాటు భాజపాకు కూడా ప్రశాంత్ పనిచేశారు. దేశ రాజకీయాలపై ప్రశాంత్ కిశోర్‌కు అవగాహన ఉంది” అని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ జరిగింది. సమావేశానికి తెరాస ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై తెరాస శాసనసభాపక్ష సమావేశంలో ప్రధానంగా చర్చించారు. భేటీ అనంతరం తెలంగాణ భవన్ నుంచి శాసనసభాపక్ష భేటీ వివరాలను సీఎం కేసీఆర్ మీడియాకు వివరించారు. ముందస్తుకు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈసారి మేం 95 నుంచి 105 స్థానాలు గెలుస్తాని ధీమా వ్యక్తం చేశారు.