కాంగ్రెస్ వ్యూహకర్తగా పీకే.. మళ్లీ చర్చలు మొదలు

ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ తో గత ఏడాది కాంగెస్ అధిష్టానం చర్చలు జరిపింది.  ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహకర్తగా కాకుండా.. పార్టీ పదవిని చేపట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలొచ్చాయి. కానీ ఆ చర్చలు ఫలించలేదు. పీకే పెట్టిన షరతులను కాంగ్రెస్ సీనియర్లు వ్యతిరేకించారనే వార్తలు వినిపించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ.. పలుమార్లు పీకే కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే మళ్లీ ఇప్పుడు 2022 చివర్లో జరిగే గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ రంగంలోకి దిగనున్నాడన్న వార్తలు పార్టీలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తొలి దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. పీకే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధిష్ఠాన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.