ఆస్కార్ వేదికపై చెంప దెబ్బ

ఆస్కార్‌ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. ప్రముఖ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ పై నటుడు విల్‌ స్మిత్‌ చేయి చేసుకున్నాడు. వేదికపైనే ఆయన చెంప చెల్లుమణిపించాడు.  క్రిస్‌ రాక్‌ అకాడమీ అవార్డుల వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు ప్రకటించడానికి ముందు ఆయన వీక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తేందుకు ఓ కామెడీ ట్రాక్‌ను చెప్పుకొచ్చారు.

అందులో ప్రముఖ నటుడు విల్‌ స్మిత్‌ సతీమణి జాడా పింకెట్‌ ప్రస్తావనను తీసుకొచ్చారు. జుట్టు పూర్తిగా తొలగించుకొని వేడుకకు హాజరైన విల్‌ స్మిత్‌ సతీమణి జాడా పింకెట్‌ ప్రస్తావనను తీసుకొచ్చారు. ‘జీ.ఐ.జేన్‌’ చిత్రంలో ‘డెమి మూర్‌’ ప్రదర్శించిన పాత్రతో పోల్చారు. ఈ చిత్రంలో ఆమె పూర్తిగా గుండుతో కనిపించడం గమనార్హం. జీ.ఐ.జేన్‌ సీక్వెల్‌లో కనిపించబోతున్నారా?అంటూ హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు.

పింకెట్‌ ‘అలోపేసియా’ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో జుట్టు ఊడిపోతుంటుంది. ఈ విషయాన్ని ఇటీవల ఆమె బహిరంగంగా తెలిపారు కూడా. అప్పటి వరకు క్రిస్‌ జోక్‌లకు నవ్వుతూ కనిపించిన స్మిత్‌.. ఒక్కసారిగా లేచి వేదికపైకి నడుచుకుంటూ వెళ్లారు. క్రిస్‌ చెంప ఛెళ్లుమనిపించి వెనుదిరిగారు. వెనక్కి వచ్చిన స్మిత్‌ తన కుర్చీలో కూర్చుని క్రిస్‌పై గట్టిగా అరిచారు. ‘నా భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దు’ అంటూ రెండుసార్లు గట్టిగా హెచ్చరించారు. 

#badboys3 #gijane2 #willsmith #chrisrock #oscars #besttvever

Can’t believe what I just saw live on screen pic.twitter.com/YiijPRQENt— Guy Springthorpe (the pistol slug) (@GuySpringthorpe) March 28, 2022