విజయ్ కోసం దిశా పటానీ ?

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  #Thalapathy66 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకున్నారని సమాచారం. మరోవైపు కృతి సనన్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే పటానీ ఫిక్స్ అని మెజారిటీ ప్రేక్షకులు అంటున్నారు. అంతేకాదు.. విజయ్-పటానీల ఫోటోలను వైరల్ చేస్తున్నారు. దీనిపై చిత్రబృందం క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు విజయ్ నటించిన 65వ సినిమా బీస్ట్ ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానిక్ నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. విజయ్ కి జంటగా పూజా హెగ్డే నటించింది. భారీ అంచనాల మధ్య బీస్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ వెంటనే వంశీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో విజయ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు.