అలర్ట్ : ఈ మాడల్స్‌లో వాట్సాప్ సేవలు బంద్

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, కాయ్‌ ఓఎస్‌ల్లోని కొన్ని వెర్షన్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్‌ 4.0, అంతకంటే తక్కువ వెర్షన్‌లో ఇక వాట్సాప్‌ పనిచేయదు. అలాగే ఐఓఎస్‌ 10 అంతకంటే పై వెర్షన్‌లోని మోడల్స్‌లో మాత్రమే వాట్సాప్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. కాయ్‌ 2.5 వెర్షన్‌ కంటే తక్కువగా ఉన్న మోడళ్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు కంపెనీ కొన్ని ఫోన్‌ మోడళ్ల పేర్లతో జాబితాను విడుదల చేసింది.

శాంసంగ్‌:

శాంసంగ్‌ కంపెనీ గతంలో విడుదల చేసిన గెలాక్సీ ట్రెండ్‌ లైట్‌, గెలాక్సీ ఎస్3 మినీ, గెలాక్సీ ఎక్స్‌కవర్‌ 2, గెలాక్సీ కోర్‌ వంటి మోడల్స్‌లో మార్చి 31 తర్వాత వాట్సాప్‌ పనిచేయదు.

ఎల్‌జీ:

ఎల్‌జీ కంపెనీకి చెందిన ఆప్టిమస్‌ సిరీస్‌లో ఎఫ్‌3, ఎఫ్5, ఎఫ్‌6, ఎఫ్‌7, ఆప్టిమస్‌ ఎల్‌3 II డ్యూయల్‌, ఎల్‌4 II డ్యూయల్, ఆప్టిమస్‌ ఎల్ II, ఎఫ్‌5 II, ఎఫ్‌5 II డ్యూయల్‌, ఎఫ్‌7 II, ఎఫ్‌7 II డ్యూయల్‌, ఎల్‌జీ ఎన్‌ఆక్ట్‌, ఆప్టిమస్‌ ఎల్‌2 II, ఆప్టిమస్‌ ఎఫ్‌3క్యూ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

మోటోరోలా:

మోటోరోలా డ్రాయిడ్‌ రాజర్‌ మోడల్స్‌ అమ్మకాలు భారత్‌లో నిలిచిపోయాయి. అయినప్పటికీ ఎవరైనా ఇంకా ఈ మోడల్స్‌ ఉపయోగిస్తున్నట్లయితే ఆయా మోడల్స్‌లో ఇక వాట్సాప్ పనిచేయదు.

షావోమీ:

షావోమి కంపెనీ తీసుకొచ్చిన హంగ్ఎంఐ, ఎంఐ2ఏ, రెడ్‌మీ నోట్‌ 4జీ, హంగ్ఎంజీ 1ఎస్‌ వంటి మోడళ్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి.

హువావే:

హువావే గతంలో విడుదల చేసిన అసెండ్‌ డీ, క్వాడ్‌ ఎక్స్‌ఎల్‌, అసెండ్‌ డీ1, క్వాడ్‌ ఎక్స్‌ఎల్‌, అసెండ్‌ పీ1 ఎస్‌ లాంటి మోడళ్లలోనూ వాట్సాప్‌ పనిచేయదని వాట్సప్‌ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది.