కేజీఎఫ్-2 రన్ టైమ్ ఎంతో తెలుసా ?

కేజీఎఫ్-2 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. యష్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమా 168 నిమిషాలుంది. కేజీఎఫ్ ఛాప్టర్-1  2 గంటల 34 నిమిషాలు తోనే వచ్చింది. కానీ పార్ట్-2కు వచ్చేసరికి మాత్రం మేకర్స్ కాంప్రమైజ్ కాలేదు. 2 గంటల 48 నిమిషాల నిడివితో సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా 3 గంటల 2 నిమిషాలుంది. మహర్షి సినిమా 2 గంటల 48 నిమిషాలుంది. అర్జున్ రెడ్డి, మహానటి, భరత్ అనే నేను, రంగస్థలం, అరవింద సమేత, మహర్షి.. ఇలా చాలా సినిమాలు రెండున్నర గంటల్లో సినిమాను చూపించాలనే ఫార్మాట్ నుంచి బయటకొచ్చేశాయి. మారిన పరిస్థితుల దృష్ట్యా కంటెంట్ బాగుంటే ప్రేక్షకుడు అదనంగా మరో 15-20 నిమిషాలు కూర్చోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడనే విషయం రుజువైంది. దీంతో కేజీఎఫ్ పార్ట్-2ను కుదించాలనుకోలేదు. 2 గంటల 48 నిమిషాల నిడివితో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.