పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తనకు సంబంధం లేకుండా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రియాశీల రాజకీయాల్లోకి రావడంపై  తాజాగా తారక్‌ స్పందించారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఘన విజయం సాధించిన సందర్భంగా తారక్‌ బాలీవుడ్‌ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ హిందీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌తో ఆయన ముచ్చటించారు.

ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీ పై స్పందిస్తూ.. ‘రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎంతో మంది అడుగుతున్నారు. నేను భవిష్యత్తు గురించి నమ్మను. కేవలం ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకునే వ్యక్తిని. ప్రస్తుతం ఒక నటుడిగా ఈ ప్రయాణాన్ని అన్నివిధాలుగా ఎంజాయ్‌ చేస్తున్నా. నటుడిగా మంచి సినిమాలు చేసుకుంటూ ఎంతో సంతృప్తిగా ఉన్నాను’’ అని వివరించారు. అయితే పొలిటికల్ ఎంట్రీ ఉండదు అని మాత్రం చెప్పలేదు. మరోవైపు టీడీపీ ఆశాకిరణంగా కార్యకర్తలు ఎన్ టీఆర్ ను భావిస్తున్నారు.