న్యాయవ్యవస్థ గొప్పగా ఉండాలి

రాష్ట్రంలో పటిష్ట ఆర్థిక పురోగతి సాధిస్తున్నామని.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లోనూ ముందుకెళ్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో కేసీఆర్‌ మాట్లాడారు. రాష్ట్ర న్యాయవ్యవస్థ, పరిపాలనా విభాగం గొప్పగా ఉండాలన్నారు.

హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంపుపై కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖరాశానని కేసీఆర్‌ గుర్తుచేశారు. అయితే ఆ అంశం పెండింగ్‌లో ఉండేదని.. సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ బాధ్యతలు చేపట్టాక ఆ సమస్య పరిష్కారమైందని చెప్పారు. బెంచీల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 885 అదనపు పోస్టులను హైకోర్టుకు కేటాయించామన్నారు. ఈ సందర్బంగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు కృతజ్ణతలు తెలిపారు.