ఆర్మీ చీఫ్గా మనోజ్ పండే
ఇండియన్ ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. నియామకాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ చర్చలు జరిపి.. పాండేను సైన్యాధిపతిగా ఎంపిక చేసింది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్ పాండేను ఆయన వారసుడిగా కేంద్రం ఖరారు చేసింది.
కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఆర్మీ చీఫ్ కానున్న తొలి వ్యక్తి పాండేనే కావడం విశేషం. ఆర్మీ చీఫ్ కోసం పాండేతో పాటు జై సింగ్ నయన్, అమర్దీప్ సింగ్ భిందర్, యోగేంద్ర దిమ్రీ పేర్లను కేంద్రం పరిశీలించింది. వీరిలో అత్యంత సీనియర్ అయిన పాండేకే బాధ్యతలను అప్పగించింది.