వికాట్ పూల్ పిక్.. వైరల్ !

పెళ్లి తర్వాత ప్రతి క్షణాన్ని అస్వాదిస్తున్నారు బాలీవుడ్ స్టార్ కపుల్స్ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్. వీలు చిక్కినప్పడల్లా ఫారిన్ టూర్స్ వేస్తున్నారు. సరదాగా గడుపుతున్నారు. టైమ్ దొరక్కుంటే.. దేశంలోని ఇష్టమైన ప్రదేశాలను చుట్టేస్తున్నారు. తాజాగా ఈ జంట స్విమ్మింగ్ పూల్ లో సేదతీరింది. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేసింది. స్విమ్ సూట్ లో ఉన్న కత్రినా.. షర్ట్ లేకుండా ఉన్న భర్తను కౌగిలించుకొని ఉన్న ఫోటో ఆకట్టుకుంటోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. కత్రినా, విక్కీ ఇద్దరు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కత్రినా సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్‌లతో కలిసి ‘ఫోన్ భూత్‌’లో నటిస్తోంది. ప్రియాంక చోప్రా, అలియా భట్‌లతో కలిసి ‘జీ లే జరా’లో  నటించనుంది. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్నారు. ఇక సల్మాన్ ఖాన్ కి జంటగా కత్రినా నటిస్తున్న టైగర్ 3 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక విక్కీ కౌశల్ ప్రస్తుతం గోవింద నామ్ మేరా, గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, లక్ష్మణ్ ఉత్తేకర్, ఆనంద్ తివారీ సినిమాల్లో నటిస్తున్నారు. 

The hottest couple of town #KatrinaKaif, #VickyKaushal‘s pool pic pic.twitter.com/IjdFDOTBdb— OTTRelease (@ott_release) May 7, 2022