ప్రాజెక్ట్ అప్ డేట్స్ ఇవ్వడం కుదరదు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ పెట్టేశారు. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాల్లో నటిస్తున్నారు. ఒక సినిమా షూటింగ్ నుంచి గ్యాప్ తీసుకొని.. మరో సినిమా షూట్ లో జాయిన్ అవుతున్నారు. ప్రాజెక్ట్-కె కు ఇచ్చిన గ్యాప్ లో సలార్ సినిమాను తిరిగి ప్రారంభించబోతున్నారు ఈనెల 24 నుంచి సలార్ కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో మొదలవుతుంది.

దాదాపు 3 వారాల పాటు సాగే ఈ భారీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సలార్ టీజర్ పై ప్రకటన రానుంది. అయితే ఈ వారంలోనే సలార్ అప్ డేట్ ఇవ్వాలని అభిమానులు పట్టుబడుతున్నారు. ఓ అభిమాని అయితే ఈ వారంలో సలార్ అప్ డేట్ ఇవ్వండి.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ లేఖను రాశారు. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కె దర్శకుడు నాగ్ అశ్విన్ అలర్ట్ అయ్యారు. తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె అప్ డేట్స్ ఇవ్వడం కుదరని క్లారిటీ ఇచ్చారు. 

“ప్రాజెక్ట్-కె సినిమాకు సంబంధించి ఇప్పుడే ఒక షెడ్యూల్ అయింది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ ఇంట్రోకు సంబంధించిన ఓ చిన్న బిట్ కూడా షూట్ చేశాం. అది చాలా బాగా వచ్చింది. ప్రభాస్ చాలా కూల్ గా కనిపించాడు. జూన్ నెలాఖరు నుంచి మరో కొత్త షెడ్యూల్ ఉంటుంది. ప్రభాస్ సినిమాల లిస్ట్ లో చూసుకుంటే ప్రాజెక్ట్-కె ఆఖర్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇవ్వడం కుదరదు. కానీ కచ్చితంగా మంచి అప్ డేట్స్ తోనే ముందుకొస్తాం. ఈ  సినిమా కోసం అందరం ప్రాణంపెట్టి పని చేస్తున్నాం.” అన్నారు నాగ్ అశ్విన్