పటీదార్.. మరో సెహ్వాగ్ ?
రజత్ పటీదార్.. రాత్రికి రాత్రే స్టార్ అయిన యువ క్రికెటర్. రజత్ పటీదార్ (112 నాటౌట్; 54 బంతుల్లో 12×4, 7×6) దంచి కొట్టడంతో ఎలిమినేటర్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో లఖ్‌నవూపై విజయం సాధించింది. బెంగళూరు ఇన్నింగ్స్‌లో రజత్ పటీదార్ ఆటే హైలైట్. పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడ్డ పటీదార్ లఖ్‌నవూ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. మరోవైపు నుంచి వికెట్లు పోతున్నా.. ఎక్కడా అతడి విధ్వంసం ఆగలేదు. కళ్లు చెదిరే షాట్లతో చెలరేగిపోయాడు.
క్రీజులో ఉన్నది ఓ యువ ఆటగాడిలా అనిపించలేదు. మరో సెహ్వాగ్ లా కనిపించాడు. అతడిలో ఏమాత్రం భయం, బెరుకు కనిపించలేదు. అంతేకాదు.. ఆఫ్ సెంచరీ.. సెంచరీ పూర్తి చేసిన సమయంలోనూ.. నరాలు తెగేలా అరవలేదు. సెలబ్రేట్ చేసుకోలేదు. కూల్ గా కనిపించాడంతే. అందుకే రజత్ టీమిండియాకు దొరికిన మరో సెహ్వాగ్ అని మాజీలు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నాయి. రజత్ ఆట గాలివాటం కాదని నిరూపించుకోవాలంటే.. మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ రాణించి.. ఆర్సీబీకి ఐపీఎల్ కప్ అందించాల్సి ఉంటుంది.