ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. !
ఆంధ్రప్రదేశ్ లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, మానవ హక్కుల , రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఏపీ బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీ శ్రేణుల మీద దాడులు జరుగుతుంటే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని గవర్నర్ కు ఫిర్యాదు చేసారు బీజేపీ నేతలు.
సీఎం పర్యటన పేరుతో ఏలూరలో బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేశారని తెలిపారు. కడపలో టీడీపీ దీక్ష చేస్తున్నట్టు నటించి బీజేపీ నాయకుల ఇంటి మీద దాడులు చేశారు. ఇంత దుర్మార్గంగా ప్రతిపక్ష నాయకులు మీద దాడులు చేయడం ఇదే మొదటిసారన్నారు. ఏపీలో రాజ్యాంగపదవుల్లో ఉన్నావారు కూడా కార్యకర్తలుగానే పనిచేస్తున్నారని, గవర్నర్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.