రాజ‌మౌళి, అనిల్.. నాటౌట్ !

టాలీవుడ్‌లో అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కులు అనగానే టక్కున ముగ్గురు పేర్లు గుర్తుకొచ్చేవి. ఒక‌రు రాజ‌మౌళి. మరొకరు కొరటాల శివ. ఇంకొక‌రు అనిల్ రావిపూడి. అయితే ‘ఆచార్య‌’ అట్టర్ ప్లాప్ తో హిట్ ట్రాక్ లిస్ట్ నుంచి కొరటాల ఎగిరిపోయారు.

అనిల్ రావిపూడిది కూడా నాన్ స్టాప్ సక్సెస్ ట్రాకే. ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్ 2, స‌రిలేరు నీకెవ్వ‌రు.. ఇలా వ‌రుస‌గా సక్సెస్ కొట్టుకుంటూ వ‌చ్చారు. ఇప్పుడు ఎఫ్ 3తో ఆ ట్రాకుని కాపాడుకోగ‌లిగారు రావిపూడి. ఆయ‌న బ‌లం కామెడీనే. లాజిక్ లేక‌పోయినా.. కామెడీతో మ్యాజిక్ చేసే స‌త్తా.. రావిపూడికి ఉంద‌న్న విష‌యం ఎఫ్ 3తో మ‌రోసారి అర్థ‌మైంది. ఈ సినిమాలో క‌థేం కొత్త‌గా లేదు. పాత్ర‌లూ అవే. కానీ.. త‌న కామెడీ టైమింగ్‌తో నిల‌బెట్టేశారు.