పార్టీ నైట్.. రెచ్చిపోయిన పూజా !

గత బుధవారం ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత 50వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ గ్రాండ్ జరిగాయి. ఈ పార్టీకి బాలీవుడ్ మొత్తం కదిలొచ్చింది. తమన్నా, రకుల్, పూజా హెగ్డే లాంటి సౌత్ స్టార్స్ మెరిశారు. స్టైలిష్ గా కనిపించడంలో బాలీవుడ్ భామలతో పోటీ పడ్డారు. ఈ పార్టీని ప్రతి ఒక్కరు కమర్షియల్ గా వాడుకున్నారు. పార్టీ కోసం కొన్న ఖైరీదైన డ్రెస్, కాస్ట్యూమ్స్ తో ఫోటో షూట్ చేశారు. కొందరు పార్టీకి హాజరయ్యే ముందే ఆ పని చేస్తే.. మరికొందరు పార్టీకి హాజరయ్యి.. మస్త్ గా ఎంజాయ్ చేసిన తర్వాత.. ఆ పని చేశారు.

బుట్టబొమ్మ పూజా హెగ్డే రెండో కోవకు చెందింది. నైట్ పార్టీ కిక్కులో కెమెరా ముందు హాట్ గా పోజులిచ్చింది. గ్లామర్ షో కంటే.. ఆమె కళ్లలో కసి కనిపిస్తుంది. డోర్ దగ్గర నిలబడి.. సవాల్ విసిరింది. దీనికి సంబంధించిన రెండు ఫోటోలను పూజా.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తోంది పూజా. తెలుగులో మహేశ్, పవన్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.