లాల్‌సింగ్‌ చద్ధా ట్రైలర్ టాక్

అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్ధా’ నాగచైతన్య కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో కరీనాకపూర్‌ కథానాయిక. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకురాబోతుంది. గుజరాత్-రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్-2022 ఫైనల్ పోరు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఆమిర్‌, చైతన్యల లుక్‌ కొత్తగా ఉంది. ఈ ఇద్దరి అభిమానులు వీరి నుంచి ఆశించే అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఆమీర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.