ఆర్యన్‌ ఖాన్‌.. గంజాయి అలవాటు ఉంది

క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో క్లీన్‌చిట్‌ పొందిన బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ గురించి ఎన్‌సీబీ షాకింగ్ విషయాలు చెప్పింది. ఆర్యన్‌ అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ చదువుతున్నప్పటి నుంచే గంజాయి తాగడం ప్రారంభించాడని.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారని తెలిపింది. నిద్ర సంబంధిత రుగ్మతల నుంచి ఉపశమనం పొందేందుకు దాన్ని తీసుకోవడం మొదలుపెట్టినట్లు ఆయన చెప్పారని పేర్కొంది.

అలాంటప్పుడు డ్రగ్స్ కేసులో అతడికి క్లీన్ చీట్ ఎలా వచ్చింది ? అనే డౌటు అనుమానం కలగడం సహజమే. ఈ నేపథ్యంలోనే కావాలనే డ్రగ్స్ కేసు నుంచి ఆర్యన్ ను తప్పించరనే ప్రచారం జరిగింది. హై ప్రొఫైల్ కేసుల్లో ఇలాంటివి జరగడం సాధారణమేనని జనాలు చెప్పుకుంటున్నారు. దీనిపై ఎన్సీబీ అధికారులను ప్రశ్నిస్తే.. ఆర్యన్ ఖాన్ కు గంజాయి అలవాటు ఉన్న మాట వాస్తవమే. కానీ క్రూజ్ నౌకలో ఉన్నప్పుడు అతడు డ్రగ్స్ తీసుకోలేదని వివరణ ఇస్తున్నారు.