దిల్ రాజు స్ట్రాటజీ వర్కవుట్
‘సాధారణ టికెట్ రేట్లకే సినిమా’ అంటూ ఎఫ్ 3 కోసం దిల్ రాజు వినూత్న ప్రచారం చేశారు. టికెట్ రేట్లు పెరగడం వల్ల జనాలు థియేటర్లకు రావడం లేదని, సామాన్య ప్రేక్షకులకు సినిమా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో… దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది మంచి ఫలితాన్ని అందించిందనే అనిపిస్తోంది.
‘సర్కారు వారి పాట’, ‘ఆచార్య` సినిమాతో పోలిస్తే… ‘ఎఫ్ 3’ రేట్లు గణనీయంగా తగ్గాయి. తగ్గిన రేట్లు.. ఎఫ్ 2 ఫ్రాంచైజీపై ఉన్న నమ్మకం, ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అనే భరోసా కలగడంతో.. కుటుంబ ప్రేక్షకులు థియేటర్ల దారి పట్టారు. తొలిరోజు రకరకాల టాక్స్ వినిపించినా – చివరికి జనం ఎఫ్ 3 వినోదానికి ఓటేశారు. మూడు రోజుల వసూళ్లు ఉత్సాహభరితంగా ఉన్నాయి. ఓ విధంగా టికెట్ రేట్ల విషయంలో దిల్ రాజు అనుసరించిన స్ట్రాటజీ వర్కవుట్ అయ్యిందనే చెప్పాలి.