కేటీఆర్ ఈజ్ బ్యాక్
తెలంగాణ మంత్రి కేటీఆర్ 12 రోజుల విదేశీ పర్యటన ముగిసింది. ఆదివారం ఆయన రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా మొదట లండన్ చేరుకున్న మంత్రి కేటీఆర్ బ్రిటన్, భారత్ వాణిజ్య మండలి రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు.
అనంతరం తెలంగాణలో పెట్టుబడులపై ప్రసిద్ధ సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. భారత రాయబారి ఏర్పాటు చేసిన వాణిజ్యవేత్తలు, ప్రవాసుల భేటీల్లోనూ పాల్గొన్నారు. 22న లండన్ నుంచి స్విట్జర్లాండ్‌కు పయనమయ్యారు. 23న దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యారు. 28 దాకా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్.. తెలంగాణ పెవిలియన్‌లో 45 మంది పారిశ్రామికవేత్తలు, అధికారులతో భేటీ అయ్యారు. పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.