వీరమల్లు.. 70 రోజులు బాకీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే.. అంత తేలిక కాదు. ఇటు పాలిటిక్స్, అటు సినిమాలు చేస్తున్నాడు పవన్. దీంతో ఆయన చెప్పినప్పుడు మాత్రమే షూటింగ్ పెట్టుకోవాలి.
ప్రస్తుతం ఫినిష్ చేయాల్సిన హరి హర వీరమల్లు సినిమా ఇంకో 70 రోజులు షూటింగ్ బకాయి వుందని వార్తలు వినిపిస్తున్నాయి. మే నెలలో ఒక షెడ్యూలు జరగాల్సి వుంది. కానీ పవన్ దాన్ని క్యాన్సిల్ కొట్టారని సమాచారం. జూన్ నెలలో ఆ షెడ్యూలు పూర్తి చేస్తారని యూనిట్ ఆశగా చూస్తోంది.
క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు తెరకెక్కుతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమా పూర్తయిన తర్వాత సముద్రఖని డైరక్షన్ లో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ రీమేక్ చేయాల్సి వుంది. దాని స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. పవన్ డేట్ లు ఆ సినిమాకు జస్ట్ ఇరవై రోజులు ఇస్తే చాలు. ఆ యూనిట్ కూడా పవన్ డేట్ ల కోసం చూస్తోంది. జూలై నుంచి డేట్ లు ఇస్తారని ఆశిస్తోంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత భవధీయుడు భగత్ సింగ్ సెట్స్ మీదకు వెళ్లనుంది.