అనుపమ.. వన్ సైడ్ లవ్ !
యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చూడటానికి స్వీట్ & క్యూట్ గా కనిపిస్తుంది. కానీ మామూలు అమ్మాయి కాదు. కోరికలన్నింటిని లోపలనే దాచుకుంటోంది. నిజానికి అనుపమ లవ్ లో ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రియుడికి చెప్పలేదు. ఓ మాంచి మూడ్ లో ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆపులోకే తన ప్రేమ వ్యవహారాన్ని బయటకి చెప్పేసింది.
”ఇంతకీ మీరు ప్రేమలో ఉన్నారా? లేదా సింగిల్‌గానే ఉన్నారా?” అని ప్రశ్నించగా.. ”నేను సింగిల్.. కాదు మింగిల్..!! ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే నా రిలేషన్‌షిప్ స్టేటస్ నాక్కూడా సరిగ్గా తెలియడం లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి, అవతలి సైడ్ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. కాబట్టి వన్ సైడ్ లవ్ అని చెప్పగలను” అంటూ నవ్వులు పూయించారు.