ఒడిలో కూర్చోబెట్టుకొని తినిపిస్తా
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తన భార్య దీపికా పదుకొనె పై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నా దీపిక అద్భుతమైన చెఫ్. లాక్ డౌన్ టైమ్ లో మేమిద్దరం చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఆ టైమ్ లో నా కోసం దీపిక చాలా వంటకాలు చేసింది. మరీ ముఖ్యంగా చైనీస్ ప్రాన్స్ చేయడంలో దీపిక ది బెస్ట్. ఈమధ్య కొత్త ఇల్లు తీసుకున్నాం. నాకు వంట రాదు. అయినప్పటికీ కొత్తింట్లోకి వెళ్లిన తర్వాత కచ్చితంగా దీపిక కోసం బ్రేక్ ఫాస్ట్ చేస్తాను. నా ఒడిలో కూర్చోబెట్టుకొని, నా చేతులతో ఆమెకు టిఫిన్ తినిపిస్తానని చెప్పుకొచ్చాడు.
దీపిక కోసం ఎగ్ కర్రీ చేస్తానని గతంలోనే మాటిచ్చానని, తన అభిమానులు ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. త్వరలోనే వారి కోరిక తీరుస్తానని చెప్పారు. 2018లో దీపిక-రణ్వీర్ పెళ్లి చేసుకున్నారు. పిల్లలు కనడానికి ఆసక్తి చూపడం లేదు. కానీ ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక ప్రాజెక్ట్ కె సినిమాతో దీపిక తెలుగు తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.