పాన్ ఇండియా సినిమా.. కమల్ హాట్ కామెంట్స్

బాలీవుడ్ లో సౌత్ సినిమాల హవా మొదలైంది. సౌత్ నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ సినిమా, హిందీ సినిమా అంటూ కొన్ని షాకింగ్ కామెంట్స్ వినవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో సౌత్ సినిమా, హిందీ సినిమాపై తన అభిప్రాయాలని పంచుకున్నారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. తన తాజా చిత్రం విక్రమ్ ప్రమోషన్ లో భాగంగా పాన్ ఇండియా సినిమాపై తనదైన విశ్లేషణ అందించారు.

సౌత్ సినిమా, హిందీ సినిమా అంటూ వేరు చేసి  చూడ‌వ‌ద్ద‌ని.. అన్ని సినిమాల‌నూ క‌లిపి ఇండియ‌న్ సినిమాగా వ్య‌వ‌హ‌రించాల‌ని అంటున్నాడు క‌మ‌ల్. సౌత్ లో ఇప్పుడు భారీ సినిమాలు వ‌స్తున్న‌ది నిజ‌మే అని, ఆ భారీ సినిమాల రూప‌క‌ల్ప‌న‌ను తాము హిందీ నుంచి చూసే నేర్చుకున్నామ‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని క‌మ‌ల్ విశ్లేషించాడు. ఒక మొఘ‌ల్ ఏ అజామ్, మ‌రో షోలే వంటి సినిమాల‌తో తామెంతో నేర్చుకున్న‌ట్టుగా క‌మ‌ల్ చెప్పాడు.