రామ్-బోయపాటి.. క్లాప్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చేయాల్సిన కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. స్రవంతి రవికిషోర్ క్లాప్ కొట్టగా, ఎప్పట్లానే తొలి షాట్ కు దర్శకుడు బోయపాటి దర్శకత్వం వహించారు. దర్శకులు లింగుసామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అందజేశారు.

రామ్ కెరీర్ లో ఇది 20వ చిత్రం. అంతేకాదు, రామ్ కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీ కూడా ఇదే. పక్కా కమర్షియల్, మాస్ హంగులతో ఈ సినిమా రాబోతోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రాబోతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నయి.