మోడీకి కేజ్రీ రిక్వెస్ట్

ప్రధాని నరేంద్ర మోడీకి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన రిక్వెస్ట్ ఆకట్టుకుంటోంది. తమ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరిని ఒకేసారి అరెస్ట్ చేయమని ఆయన కోరారు. మని లాండరింగ్ కేసులో ఆరోగ్యం, విద్యుత్, హోంశాఖల మంత్రిగా ఉన్న జైన్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు త్వరలో డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేస్తారని కేజ్రీవాల్ అన్నారు. 

బీజేపీ ప్రభుత్వం కక్ష సాదింపుగానే తన ఆధీనంలో ఉన్న అన్ని ఏజెన్సీలను వాడుకుంటుందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలందరినీ ఒకే సారి అరెస్టు చేయాలని మోడీని కోరారు. వారిని ఒక్కొక్కరిగా అరెస్టు చేయడం వల్ల జరుగుతున్న మంచి పనికి బ్రేకులు పడ్డాయి. అందుకే అందరిని కలిపి అరెస్త్ చేస్తే. విడుదలయ్యాక మంచి పనులు చేస్తామని సటైర్లు వేశారు. ఈ ఏడాది నవంబర్ లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ-ఆప్ మధ్య అప్పుడే ఎన్నికల యుద్ధం షురూ అయింది. మాటల యుద్ధం కొనసాగుతోంది.