సోనియా గాంధీకి కరోనా
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. దీంతో ఆమె హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. స్వల్ప జ్వరంతోపాటు కొన్ని కొవిడ్ లక్షణాలతో సోనియా గాంధీ బాధపడుతున్నారు. దీంతో ఆమె ఐసోలేషన్‌లో ఉండిపోయారు. ప్రస్తుతం సోనియా గాంధీకి అవసరమైన వైద్య సహాయం అందుతోంది అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మీడియాకు తెలిపారు.
ఈ నెల 8న సోనియా, రాహుల్ గాంధీలు ఈడీ ముందు హాజరుకావాల్సింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రాహుల్ గాంధీ ఇంకాస్త సమయం కోరనున్నారనే వార్తలు వినిపించాయి. ఇంతలో సోనియా గాంధీ కొవిడ్ బారినపడ్డారు.