సూర్యతో కమల్ సినిమా

విక్ర‌మ్‌లో సూర్య అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే… సూర్య‌తో ఓ పూర్తి స్థాయి సినిమా చేయాల‌ని క‌మ‌ల్ ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడ‌ట‌. త‌న కోసం క‌థ‌లు కూడా విన్నాను. కానీ సెట్ కాలేదు. అయితే త్వ‌ర‌లో త‌ప్ప‌కుండా సూర్య‌తో ఓ సినిమా నా సంస్థ నుంచి ఉంటుందని కమల్ చెప్పారు.

ఇక విక్రమ్ లో సూర్య గెస్ట్ రోల్ గురించి కమల్ మాట్లాడుతూ..  ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉంది. అది సూర్య అయితే బాగుంటంద‌నిపించిందని అనిపించింది.  ఒక్క ఫోన్ చేశాను. అంతే.. సూర్య ఒప్పుకొన్నాడు.మీరు ఎప్పుడు ర‌మ్మంటే అప్పుడ వ‌స్తా అన్న‌య్యా` అన్నాడు. అంతే.. అంత‌కు మించి మాట‌లు కూడా లేవు అన్నారు.