శ్రీవారిని దర్శించుకున్న హరీష్ రావు
తెలంగాణ మంత్రి హరీష్ రావు తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న ఆయన.. ఈ ఉదయం తలనీలాలు సమర్పించుకుని శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.
హరీష్ రావు తన ప్రతి పుట్టినరోజుని కార్యకర్తల మధ్య జరుపుకుంటారు. అయితే ఈ సారి తన పుట్టినరోజు సందర్భగా అభిమానులు, మిత్రులెవరూ హైదరాబాద్, సిద్దిపేట రావొద్దని ఇప్పటికే హరీశ్‌రావు ట్విటర్ ద్వారా కోరిన విషయం తెలిసిందే. తనపై ఉన్న ప్రేమాభిమానాలను సేవా కార్యక్రమాల ద్వారా చాటాలన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా తనని విష్ చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి కృతజ్ణతలు తెలియజేశారు.