నజ్రియా ఓపెన్ ఆఫర్

బెంగళూర్ డేస్, రాజారాణి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి నజ్రియా. ‘అంటే సుందరానికీ’తో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. చాలా మంది తెలుగు దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు.  మొత్తానికి సుందరం దర్శకుడు వివేక్ ఆత్రేయతో నజ్రియాని తెలుగులో తీసుకురావడం సాధ్యమైయింది. 

ఈ సినిమాతో వివేక్ అభిమానిగా మారిపోయింది నజ్రియా. ఆయనకి ఒక ఓపెన్ ఆఫర్ కూడా వచ్చింది. ”కథలు ఎంపిక విషయంలో కొంచెం పర్టిక్యులర్ వుండే మాత్ర వాస్తవమే. ఐతే వివేక్ తో సినిమా చేయాలనుకున్నపుడు ఇక అలోచించను. ఇకపై ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఓపెన్ డేట్స్ ఇచ్చేస్తా. ఆయన రైటింగ్ అద్భుతం. వివేక్ తో మరో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది నజ్రియా. వివేక్ కూడా నజ్రియా కోసం మరో కథని రెడీ చేసి పెట్టుకున్నాడట. కాకపోతే వెంటనే ఆ సినిమా చేయకుండా.. ఇతర హీరోలతో ఒకట్రెండు సినిమాలు చేసి నజ్రియాతో ఓ ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నట్టు సమాచారం.