రోలెక్స్ కు రోలెక్స్ వాచ్ గిఫ్ట్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ‘విక్రమ్’ హిట్ కిక్కులో ఉన్నారు. ఈ సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు.. చిత్ర బృందానికి కానుకలు కూడా ఇస్తున్నారు. నిన్ననే విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు కాస్ట్లీ కారు ఒకటి కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు సూర్యకు రోలెక్స్ వాచ్ ను బహుమతిగా ఇచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలను సూర్య తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు కమల్ హాసన్ కి థ్యాంక్స్ చెప్పారు.


విక్రమ్ సినిమాను చాలా ఆసక్తిగా మలిచాడు దర్శకుడు. ఇందులో కొడుకుని చంపిన డ్రగ్స్ మాఫియాపై రివేంజ్ తీర్చుకునే ఒకప్పటి ఇండియన్ ఏజెంట్ గా కమల్ నటించారు. ఫహాద్ ఫాజిల్ కమల్ ను వెంటాడే అధికారి పాత్ర చేయగా, విజయ్ సేతుపతి విలన్ రోల్ చేశారు. చివర్లో సూర్య డ్రగ్స్ మాఫియా అధినేత రోలెక్స్ సర్ గా అదరగొట్టాడు. రోలెక్స్ పాత్రలో కనిపించిన సూర్యకు కమల్ రోలెక్స్ వాచ్ ను గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. ఇక విక్రమ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది. వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్ల మార్క్ కు దగ్గరైంది.