నాగ్ ఇంటి ముందు యువతి హల్ చల్

హీరో నాగార్జున ఇంటి ముందు ఓ యువతి హల్ చల్ చేసింది. నాగ్ తనకి రూ. 4కోట్లు ఇవ్వాలని నానా హడావుడి చేసింది. చివరకు పోలీసులు వచ్చి ఆమెని తీసుకెళ్లారు. వివరాల్లోకి వెఌతే… ఆదిలాబాద్‌కు చెందిన విజయ అనే మహిళ మంగళవారం జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 51లో ఉన్న నాగార్జున ఇంటికి వెళ్లింది. తాను నాగార్జునను కలవాలని అనుకుంటున్నట్టు పీఏకు చెప్పింది. ఇప్పుడు ఆయన లేరని పీఏ సమాధానం ఇచ్చారు.

అసలు ఎందుకు నాగ్ ని కలవాలనుకుంటున్నారని అడిగారు. దానికి నాగార్జున తనకు రూ.4 కోట్లు ఇవ్వాలని చెప్పింది. ఆమె సమధానంతో విస్తుపోయిన పీఏ నాగార్జున లేరని, తర్వాత రావాలని చెప్పారు. అయినా.. ఆ యువతి వినిపించుకోకుండద రోడ్డుపై హడావిడి చేసింది. దీంతో నాగ్ పీఏ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ యువతిని అదుపులోనికి తీసుకొన్నారు. ఆ యువతి మానసిక స్థితి బాగాలేదని పోలీసులు తేల్చారు. ఆమె బంధువులకు సమాచారం అందించి వారికి అప్పగించారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నాగ్ నానితో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తనయులు ఇద్దరికి మంచి కథలు సెట్ చేసే బాధ్యతని తీసుకొన్నారు. వారిద్దరిని స్టార్స్ ని చేయాలని నాగ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.