దసరా.. 60 కోట్ల సినిమా !

కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా ‘దసరా’. కీర్తి సురేష్ హీరోయిన్. సింగరేణి బ్యాక్ డ్రాప్ లో రంగస్థలం టైపు కథ. పల్లెటూరు, అగ్రవర్ణాలు, బడుగు వర్గాలు అంటూ విభజనరేఖలు..వివాదాలు వంటి అచ్చమైన నేటివ్ కథ.

ఈ సినిమా కోసం రంగస్థలం మాదిరిగా ఓ ఊరు సెట్ నే వేసారు. దానికే దాదాపు మూడు, నాలుగు కోట్లు ఖర్చుచేసారు. మొత్తం 60 కోట్ల మేరకు దసరా సినిమా బడ్జెట్ వుంటుందని తెలుస్తోంది. గతంలో దిల్ రాజు నిర్మించిన ‘వి’ సినిమాకు రూ. 40కోట్లు అయింది. ఇప్పుడు దసరా కోసం అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు.