పవన్’ని కోర్టుకు లాగిన ఏబీఎన్ ఎండీ
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్’ను ఏబీఎన్ ఎండీ రాథాకృష్ణ కోర్టుకు లాగారు. పవన్ పై రూ. 10కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీనిపై హైదరాబాద్ సివిల్ కోర్టు పవన్ కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 24న కోర్టులో స్వయంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ హాజరుకావాలని ఆదేశించింది.
సాధారణంగా పవన్ తనపై ఇతరులు చేసిన ఆరోపణలకు స్పందించారు. ఐతే, నటి శ్రీరెడ్డి తన తల్లిని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు పవన్ కు ఆగ్రహాన్ని తెప్పించాయి. దీనిపై పవన్ గట్టిగానే స్పందించారు. ఏకంగా ఫిల్మ్ ఛాంబర్ కు విచ్చేశారు. ఆయనకు మద్దతుగా మెగా హీరోలందరు కదిలి వచ్చారు. ఆ తర్వాత ఈ ఏపీసోడ్ మీడియా ఛానెల్స్ వ్యవహరించిన అత్యుత్సాహాన్ని పవన్ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై అనుచత ట్విట్లు చేశారు. తన తల్లిని ఎవరో దూషించిన విషయాన్ని ఉపయోగించుకుని రాధాకృష్ణ మైలేజీ పొందాలనుకున్నారంటూ పవన్ ఆరోపించారు. వరుస ట్విట్స్ తో పాటు కొన్ని ఫోటోలని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన రాథాకృష్ణ పవన్ తనకు క్షమాపణలు చెప్పాలని లాయర్ ద్వారా నోటీసులు పంపారు. దీనిపై పవన్ స్పందించకపోవడంతో.. పవన్ పై రూ. 10కోట్ల పరువు నష్టం దావా వేశారు.
తాజాగా, దీనికి సంబంధించి కోర్టు పవన్ కు సమన్లు జారీచేసింది. మరీ.. ఈ నోటీసులపై పవన్ ఎలా స్పందిస్తారు ? కోర్టు ఆదేశించినట్టు ఈ నెల 24న కోర్టుకు హాజరవుతారా.. ? అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు, ఇదంతా పొలిటికల్ గేమ్ లో భాగమనే ప్రచారం జరుగుతోంది. రాథాకృష్ణ వెనక టీడీపీ ఉందనే విమర్శలొస్తున్నాయి. కావాలనే శ్రీరెడ్డి పవన్ తల్లిపై చేసిన కామెంట్స్ ని హైలైట్ చేసి చూపించారనే ప్రచారం జరుగుతోంది.