సుందరానికి కత్తెర.. వద్దే వద్దు !
సినిమా ఎంత బాగున్నా రన్ టైమ్ చాలా ముఖ్యం. షార్ప్ గా రెండున్నర గంటలు, అంతకంటే లోపు ఉంటేనే బెటర్. అలాకాదని మూడు గంటల సినిమా చూపిస్తామంటే మొదటికే మోసం వచ్చిన సందర్భాలు కోకొల్లలు. అయితే ‘అంటే సుందరానికి’ కత్తెర పెట్టడానికి నిర్మాతలు అస్సలు ఒప్పుకోవడం లేదట. ఇలాంటి సినిమా లెన్త్ ఎక్కువైనా జనాలు చూస్తారని నమ్మకంగా ఉన్నారట. ట్రిమ్ చేయడానికి ఒప్పుకోవడం లేదట. దీంతో మూడు గంటల సినిమాగా సుందరం రేపు థియేటర్స్ లోకి రాబోతున్నారు.
ఈసినిమాపై మంచి బజ్ ఉంది. టీజర్లు, ట్రైలర్లు బాగున్నాయి. కాకపోతే సినిమా నిడివే దాదాపు 3 గంటలు. ఇంత పెద్ద సినిమాని, ఈ రోజుల్లో భరాయించడం చాలా కష్టం. కానీ నిర్మాతలు మాత్రం కత్తెర వేయకూడదంతే..
అని పట్టుపడుతున్నార్ట. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. నానికి జంటగా నజ్రియా నటించింది. టీజర్, ట్రైలర్ తో నవ్వులు పూయించాడు సుందరం. సినిమాలో నాన్ స్టాప్ నవ్వులు ఉండబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. నవ్వించిన ఏ సినిమా ప్లాప్ కాలేదనే ధీమాతో మైత్రీ నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది.