పులులు.. పిల్లులుగా మారారేంటీ ?
ఐపీఎల్ లో పులుల్లా గర్జించిన టీమిండియా ఆటగాళ్లు దేశం కోసం ఆడేటప్పుడు మాత్రం పిల్లుల్లా మారిపోతున్నారు. ఇటీవల ఐపీఎల్ లో అదరగొట్టారు. కమర్షియల్ ఆటలో కేకపెట్టించారు. ఐతే ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో తేలిపోతున్నారు. వరుసగా రెండు మ్యాచ్ లో ఓటమిపాలైంది పంత్ సేన.
కటక్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 148/6 స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ (34), శ్రేయస్ అయ్యర్ (40), దినేశ్ కార్తీక్ (30) ఆ మాత్రం పరుగులు చేయడంతో.. భారత్ మోస్తరు స్కోర్ చేసింది. ఈ క్రమంలోనే ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. డికాక్ స్థానంలో క్రీజులోకి వచ్చిన క్లాసెన్ (81; 46 బంతుల్లో 7×4, 5×6) చెలరేగడంతో ఆ జట్టు సునాయాస విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో భువి 13 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.