3 శాతం దాటిన పాజిటివిటీ రేటు

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా ప్రతిరోజు 8 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 2.49 లక్షల మందికి వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,084 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో పాజిటివిటీ మూడు శాతం దాటి..3.24 శాతంగా నమోదైంది.

ప్రస్తుతం క్రియాశీల కేసులు 47,995కి చేరాయ్. క్రియాశీల కేసుల రేటు 0.11 శాతానికి చేరింది. ఇప్పటివరకూ 4.32 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.26 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 4,592 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. కొత్త కేసులు, కోలుకుంటున్నవారి మధ్య ఉన్న భారీ అంతరం కారణంగా రికవరీ రేటు 98.68 శాతానికి పడిపోయింది. 24 గంటల్లో 10 మంది మరణించారు.