షాక్ : చైతూ-సమంత విడిపోతారట
టాలీవుడ్ ప్రేమజంట నాగ చైతన్య-సమంతలు గత యేడాది పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంటగా హాయిగా కాపురం చేసుకొంటోంది. మరోవైపు, పెళ్లి తర్వాత వీరి కెరీర్ మరింత ఊపందుకొంది. సామ్ నటించిన చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. ఆమె నటించిన మెర్సల్, రంగస్థలం, మహానటి, అభిమన్యుడు భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. చైతూ కూడా మరింత బిజీ అయిపోయాడు. ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల్లో మంచి విజయాన్ని అందుకొన్నాయి. చైతూ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇలాంటి హ్యాపీ మూడ్ లో చైతూ-సమంతలు విడిపోనున్నారన్న న్యూస్ అక్కినేని అభిమానులని షాక్ కి గురి చేస్తోంది.
పెళ్లికి ముందు కలిసి నటించిన ఈ జంట పెళ్లి తర్వాత మాత్రం జతకట్టలేదు. ఇప్పుడా సినిమాకు రంగం సిద్ధమైంది. ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాలో చైతూ-సామ్ జంటగా నటించబోతున్నారు. సినిమాలోనూ పెళ్లైన జంటగా చైతూ-సమంత కనిపించబోతున్నారు. అనుకోకుండా వీరి జీవితాల్లోకి ఓ యువతి రావడంతో విడిపోతారట. తిరిగి మళ్ళీ వీరిద్దరూ ఎలా ఒక్కటయ్యారనేదే ఈ చిత్ర కథ అని చెబుతున్నారు. ఈ సినిమా స్టోరీ లైన్ బయటకు రావడంతో.. చైతూ-సామ్ విడిపోతారని ప్రచారం జరుగుతోంది. ఐతే, అది రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో అనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఇప్పటికే సమంత చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తిచేసింది. చైతూ కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం చైతూ సవ్యసాచి, శైలాజా రెడ్డి అల్లుడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలని పూర్తి చేసిన తర్వాత చైతూ-సమంతల సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అప్పటి వరకు సామ్ చైతూ కోసం ఎదురు చూస్తూ ఉంటుందట. ఈలోగా తాను నటించిన సినిమాల ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొననుందని తెలుస్తోంది.