హాస్పిటల్ లో దీపిక.. ప్రాజెక్ట్ వారం వాయిదా !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకే టైమ్ లో మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఓ సినిమాకు బ్రేక్ ఇచ్చి.. మరో సినిమా షూట్ లో జాయిన్ అవుతున్నాడు డార్లింగ్. సలార్ షూట్ కి బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కె షూట్ లో పాల్గొనాల్సి ఉంది. తాజా షెడ్యూల్ కోసం దీపికా పదుకొనె హైదరాబాద్ కు వచ్చింది. అయితే చ్చి రాగానే ఆమె హాస్పిటల్ లో చేరింది. మొదట ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ లో జాయిన్ అయింది. అక్కడ కొన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత నోవాటెల్‌ హాస్పిటల్ కి వెళ్లిందని తెలిసింది. సడెన్ గా హార్ట్ బీట్ పెరగడంతో ఆసుపత్రికి తరలించారట.

ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ కె షూటింగ్ ను ఓ వారం రోజుల పాటు వాయిదా వేయాలని నిర్మాతలను కోరారట ప్రభాస్. వాస్తవానికి ఈ షెడ్యూల్ లో ప్రభాస్-దీపిక లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. ఇందులో కొన్ని రిస్కీ సీన్స్ కూడా ఉన్నాయట. అయితే అరోగ్యం బాగులేనప్పుడు ఇలాంటి సీన్స్ చేయడం సరికాదని ప్రభాస్ వద్దన్నారని తెలుస్తున్నది. ప్రాజెక్ట్ కె  టైమ్ మెషీన్ కాన్సెప్ట్ ను మిక్స్ చేస్తూ చేస్తున్న మైథలాజికల్ ఫాంటసీ సినిమా. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ క్రియేటివ్ హెడ్ గా పని చేస్తున్నారు.