రాష్ట్రపతి రేసులో కేఏ పాల్
రాష్ట్రపతి అభ్యర్థి రేస్‌లో తాను లేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. కేఏ పాల్ రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉంటారని పెద్ద ఎత్తున జరిగిందట. అది ఎప్పుడు, ఎలా జరిగిందో తెలియదు. కానీ బరిలో లేనని స్వయంగా పాల్ ప్రకటించడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఆర్థిక వ్యవస్థ బాగోలేదని ప్రధాని మోదీ, అమిత్ షా లకు స్పష్టంగా చెప్పినట్టు కేఏ పాల్ తెలిపారు. ఎకానమీ సమ్మిట్ పెట్టాలని కోరానన్నారు.
బీజేపీ అభ్యర్ధే రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారని తేల్చి చెప్పారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలు ఐక్యం కావాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు వేర్వేరు కూటములుగా ఉండొద్దని పాల్ సూచించారు. ముఖ్యంగా తాను ఎవరి వైపో స్పష్టం చేశారు. ఓడిపోయే వారి వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండనని స్పష్టం చేశారు. అంటే బీజేపీ పక్షాన వుంటానని చెప్పకనే చెప్పారు. బీజేపీ అభ్యర్ధి 60 శాతం ఓట్లతో గెలుస్తారని లెక్కలతో సహా చెప్పారు.