అనైక్యతే బీజేపీకి శ్రీరామరక్ష

విపక్షాల అనైక్యత బీజేపీకి శ్రీరామరక్షగా మారింది. 2024లో బీజేపీ వ్యతిరేక ఓటును ఒకే చోటకు చేర్చి మోదీని గద్దె దించాలనేది అందరి ఆలోచన. కేజ్రీవాల్, మమతా, స్టాలిన్, కాంగ్రెస్.. ఇలా అందరి వ్యూహం అదే. కానీ ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఉన్నారు.

భారత్ కు ప్రధాని కావాలనే ఆశ మమతా బెనర్జీకి ఉంది, కేజ్రీవాల్ కి కూడా అదే ఉంది, ఇటీవల కేసీఆర్ కూడా తాను భావి ప్రధాని అయితే తప్పేంటి అంటున్నారు. అందుకే అందరూ అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నారు. ఇలా లోక్ సభ ఓట్లు, చీలికలు, పేలికలు అయితే చివరకు బీజేపీయే దిక్కవుతుంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో అయినా తమ సత్తా చూపిద్దామనుకుంటే అది కూడా కుదిరేలా లేదు. దీదీపై వంకపెట్టి కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. కేసీఆర్ అసలే రానన్నారు. ఇదే కదా మోదీకి కావాల్సింది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు.. ప్రతిపక్షాలన్నీ వారిలో వారే కొట్లాడుకుంటే.. మోదీ మాత్రం తమాషా చూస్తారనమాట.